18 July, 2026 | 3:04 PM

Breaking News

శాకాంబరీ అలంకరణలో శ్రీ రేణుకా మాత.. భక్తుల వెల్లువ   •   వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఐదుగురు మృతి   •  

శాకాంబరీ అలంకరణలో శ్రీ రేణుకా మాత.. భక్తుల వెల్లువ

18-07-2026 03:03 PM

భిక్కనూర్, జూలై 18(విజయ క్రాంతి): ఆషాఢ మాసం సందర్భంగా భిక్కనూర్‌లోని శ్రీ రేణుకా మాత ఆలయంలో శనివారం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలతో శాకాంబరీ దేవి రూపంలో సుందరంగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది మునిగల్ల నాగరాజు గౌడ్ కుటుంబ సభ్యులు ప్రతి ఏడాది ఈ శాకాంబరీ అలంకరణను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, కుటుంబాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. శాకాంబరీ అలంకరణతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, రోజంతా భక్తులతో కళకళలాడింది.