కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన
కరుణించని కారుమబ్బులు .. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన..
బోథ్, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొన్నాయి. వర్షాకాలం ప్రవేశించి దాదాపు 45 రోజులు కావస్తున్న ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో మొలకెత్తిన పంటలు ఎదగడం లేదు దీంతో రైతులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి మొలకెత్తిన పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ప్రతిరోజు పూరిస్తున్నమేఘాలు..
ప్రతిరోజు కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి. వర్షం కురుస్తుందన్న ఆశతో రైతులు ఆకాశం కేసి చూస్తున్నారు. ఈదురుగాల్లో తాకిడికి వచ్చిన మేఘాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ప్రతిరోజు ఇదే విధంగా జరుగుతున్నడంతో రైతుల్లో వర్షం పైన ఆశలు సన్నగిల్లాయి. పెట్టిన పంట పెట్టుబడులు నేలపాలయ్యాయని రైతులు ఆందోళన చెందుతున్నారు నీటి తడులు ఉన్న రైతులు పంటలను కాపాడుకుంటుంటే నీటి వసతి లేని రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు.ఏది ఏమైనా పంటలు ఎదగక రైతులు దిగాలుగా ఉన్నారు.






