7 March, 2026 | 1:55 AM

నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన

06-03-2026 12:00 AM

ఆదిలాబాద్, మార్చి ౫ (విజయక్రాంతి): రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ’ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా  స్పెషలిస్ట్ క్యాంపును ఆయన ప్రారంభిస్తారు. అనంతరం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించే సన్నాహక సమావేశంలో పాల్గొంటారు.

ఈ సందర్భంగా నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో ఆయా జిల్లాల ఐడీఓసీల నుంచి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్ష నిర్వహిస్తారు.

అనంతరం ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్  ను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం ఆదిలాబాద్ మహాలక్ష్మివాడలో ఇందిరమ్మ ఇల్లు  గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో అదనపు డార్మిటరీ భవనాన్ని మంత్రి ప్రారంభిస్తారు. అక్కడి నుండి బేల మండలం ధోప్తాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరవుతారు.