9 May, 2026 | 10:40 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు

20-11-2025 12:16 PM

మంత్రి జూపల్లి కృష్ణారావు. 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని అనుమతి మేరకు తప్పనిసరిగా కొనుగోలు చేయాలని, తేమ శాతం పేరుతో రైతులను వేధిస్తే సహించేది లేదన్నారు. గురువారం కుడికిల్ల, నార్లాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూడాలని, కొనుగోలు చేసిన వెంటనే రైతులకు రసీదు ఇవ్వాలని, ధాన్య వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాల్లోకి చెల్లింపులు త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు దళారులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని మంత్రి జూపల్లి కోరారు.