6 July, 2026 | 10:34 AM

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి

06-07-2026 09:33 AM

ఆడపడుచులకు చీరల పంపిణీ, దేవాలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి నిలయాలు

ధన్వాడలో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని కాటారం, జూలై 06(విజయక్రాంతి: శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu ) అన్నారు. ఆదివారం రాత్రి మంథని నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. దేవాలయాలు సమాజంలో ఐకమత్యం, మానవతా విలువలను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా గ్రామ ఆడపడుచులకు చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.