3 September, 2026 | 2:57 AM

సీఎం రేవంత్‌పైనే చర్యలు తీసుకోవాలి!

03-09-2026 | 01:30am
  1. పదేళ్లు తనే సీఎం అని ఎలా మాట్లాడుతారు? 
  2. బహిరంగ సభల్లో అభ్యర్థులను ప్రకటించడమేంటి? 
  3. నా కుమార్తె వ్యాఖ్యలకు నేను బాధ్యురాలినా? 
  4. కాంగ్రెస్‌లో బీసీలకు ఒక న్యాయం.. రెడ్డిలకు ఒక న్యాయమా? 
  5. నన్ను బర్తరఫ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. 
  6. మంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్, సెప్టెంబర్  2 (విజయక్రాంతి): తనపై క్రమశిక్షణ చర్యలు(disciplinary action) తీసు కునే ప్రయత్నం జరిగితే ఊరుకునేది లేదని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) అన్నారు. ముందుగా పార్టీ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడు తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)పైనే చర్యలు తీసుకోవాలని ఆమె సంచలన వ్యాఖ్యలు(sensational comments) చేశారు. ‘పదేళ్లు నేనే ముఖ్యమంత్రినని రేవంత్‌రెడ్డి ఎలా మాట్లాడు తారు’ అని సురేఖ ప్రశ్నించారు.  తన కూతురు మాట్లాడిన దానికి తనను ఎలా బాధ్యురాలిని చేస్తారని అన్నారు. 

బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లి ఖార్జున ఖర్గే(Malli Karjuna Kharge)ను మంత్రి సురేఖ కలిశారు. ఆ తర్వాత మీడియా(media)తో మాట్లాడారు.. చిట్‌చాట్ చేశారు. తనపై చర్యలు తీసుకోవాలని చూడ టం ఏ రకమైన న్యాయమని ఆమె ప్రశ్నించారు.  ఓవైపు మహిళలు స్వతంత్రం(womens independence)గా ఎదగాలని, తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్(Rahul Gandhi) స్వయంగా చెబుతున్నారని ఆమె గుర్తుచేశారు.

తన కూతురిని కొన్ని పరిణామాలు రెచ్చగొట్టినందుకే విమర్శలు చేయాల్సి వచ్చిందని, కుటుంబ సభ్యుడి అభిప్రాయాలకు మంత్రిని బాధ్యురాలిగా చేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయవద్దని కాంగ్రెస్ పెద్దలను కలిసి కోరినట్లు చెప్పారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తన వివరణ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర పెద్దలకు రాతపూర్వకంగా తెలియజేశానని తెలిపారు. తన వ్యవహారంపై పార్టీలో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని అన్నారు.

ఎవరిని అడిగి టికెట్లు ప్రకటిస్తున్నారు.. 

పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసహ నం వ్యక్తం చేసిన సురేఖ, తాను బీసీ వర్గానికి చెం దిన సీనియర్ మహిళా నాయకురాలినైనందునే, కావాలని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కాం గ్రెస్ పార్టీలో బీసీలకు ఓ న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా? అని నిలదీశారు. బీసీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమని మండిపడ్డారు. తాను పద్మశాలి, తన భర్త మురళిది మున్నూరు కాపు సామాజికవర్గమని మంత్రి పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఎవరిని అడిగి, ఏ హక్కుతో బహిరంగ సభల్లో ఎన్నికల టికెట్లను ప్రకటిస్తున్నారని మంత్రి సురేఖ ప్రశ్నించారు. రాబోయే ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వా లనేది ఆయనే స్వయంగా ఎలా నిర్ణయిస్తారని అన్నారు. పదేళ్ల పాటు తానే సీఎం అని రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పుకోవడం క్రమశిక్షణా చర్యల కిందకు రాదా..?  అని మండిపడ్డారు. 

మంత్రులపై చర్యలేవి..?

పార్టీ, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై కొండా సురేఖ కుండబద్దులు కొట్టారు. తనపై చర్యలు తీసుకునే ముందు పార్టీలో, ప్రభుత్వంలో ఉన్న మరికొందరిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. పలువురు మంత్రులు, నేతలపై పెద్దఎత్తున అవినీతి, అక్రమాల ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. వాటన్నింటికీ సమాధా నం ఎవరు చెబుతారు..? ఎప్పుడు చర్యలు తీసుకుంటారని మంత్రి  ప్రశ్నించారు.

కేబినెట్‌లోని ప లువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్ర అ సంతృప్తితో ఉన్నారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను, త న అభిప్రాయాలను కాంగ్రెస్ అధిష్ఠానానికి రాతపూర్వకంగా తెలియజేసినట్లుగా సురేఖ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తనను రాజీనామా చేయమని ఎవరూ కోరలేదని తెలిపారు.

ఒకవేళ తనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసే ఆలోచన చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బ ర్తరఫ్ లాంటి తీవ్ర చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందో తాను ఇప్పుడే చెప్పలేను కానీ.. అలాం టి పరిణామాలను తెలంగాణ సమాజం సహిస్తుందని తాను ఎంతమాత్రం అనుకోవడం లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు.

పదవిలో కొనసాగించాలని కోరా..

కాంగ్రెస్ హైకమాండ్‌కు తాను చెప్పాల్సినదంతా చెప్పానని మంత్రి కొండా సురేఖ వివరిం చారు. పార్టీ పెద్దలు ఆలోచిస్తామని చెప్పారన్నా రు. తన బిడ్డ స్వతంత్రంగా ఉందని వివరించారు. పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలిగా మాట్లాడిందని అనుకుంటున్నానన్నారు. ఆమె జీవితం ఆమె ఇష్టమని సురేఖ పేర్కొన్నారు. తనతో పాటు తన భర్త రాజకీయ జీవితం మా ఇష్టం అని తెలిపారు. తా ను మంత్రిగా మంచి పనితీరు కనబరుస్తున్నానని కొండా సురేఖ చెప్పారు. అవినీతి ఆరోపణలు లే కుండా పనిచేస్తున్నానని వివరించారు. పదవిలో కొనసాగించాలని కోరానని ఆమె వివరించారు.

 ఎవరు చేయించారో తెలుసు..

 తన కుమార్తె వ్యాఖ్యలపై తాను స్పందించనని మంత్రి  కొండా సురేఖ తెలిపారు. సుస్మిత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. రోజూ ఎం తో మంది మాట్లాడతారని అందులో సుష్మిత కూడా ఒకరని కొండా సురేఖ అన్నారు. తన బిడ్డ కనుక తనను బాధ్యురాలిని చేయడం సరికాదని ఆమె వివరించారు. ఆమె వ్యాఖ్యలను ఖండించ డం, సమర్థించడం చేయనన్నారు. తన వివరణను మీనాక్షి నటరాజన్‌కు చెప్పినట్లు వెల్లడించారు.

అధిష్ఠానానికి ఆమె చెప్తానన్నారని సురేఖ వివరించారు. పార్టీలో కొంతమందితో తనపై ఆరోపణ లు చేయించారన్నారు. ఎవరు అలా చేయించారో తనకు తెలుసని కొండా సురేఖ పేర్కొన్నారు. పేర్లు చెబితే వివాదం అవుతుందన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్య లు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

పార్టీ ఆ దిశగానూ ఆలోచించాలని ఆమె కోరారు. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడమే అస లు తప్పు అని, ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్నానని అందుకే ఇక్కడికి వచ్చి తన బాధ చెప్పుకొన్నానన్నారు. రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌కు రాతపూర్వకంగా వివరణ ఇచ్చానని, పార్టీ నిర్ణ యం ఆధారంగా తన ఆలోచన ఉంటుందన్నారు.

ఖర్గేతో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ.. 

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ వ్యవహా రం, క్యాబినెట్ విస్తరణ, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపైన ఖర్గేతో రేవంత్‌రెడ్డి, భట్టి చర్చిం చినట్లు సమాచారం. భేటీ అనంతరం ఖర్గే కారులోనే సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క  వైఎస్‌ఆర్ అవార్డుల కార్యక్రమానికి వెళ్లారు. మంత్రి కొండా సురేఖ  అంశం తనకు తెలియదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.