3 September, 2026 | 4:20 AM

గ్లోబల్ సమ్మిట్‌కు రండి

03-09-2026 | 03:15am
  1. రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం
  2. రక్షణ ఎక్స్‌ఫోను ప్రారంభించాలని వినతి
  3. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రితో భేటీ
  4. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ ప్రదర్శనకు సహకరించాలని విజ్ఞప్తి
  5. దేవరకద్ర డీఆర్డీఎల్‌కు 416 ఎకరాలు..
  6. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు మరో 750 ఎకరాలు ఇస్తామని హామీ 
  7. ‘ఆదిలాబాద్, మామునూరు’పనుల్లో వేగం పెంచండి
  8. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి సీఎం వినతి

హైదరాబాద్, సెప్టెంబర్  2 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్(Invest Telangana Global Summit)-2026 హాజరుకావాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌(Rajnath Singh)ను ముఖ్య మంత్రి  రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆహ్వానించారు. డిసెంబర్ 7నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీ(Bharat Future City)లో జరిగే సదస్సులో భాగంగా రక్షణ ఎక్స్‌ఫోను ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఢిల్లీలో బుధవారం రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.

రక్షణ ఎక్స్‌ఫోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సు, ఎయిర్‌షో, పారిశ్రామిక, భూ రక్షణ వ్యవస్థ(Land Protection System)ల ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు(Defence Industries), స్టార్టప్‌(Startup)లు, యువ శాస్త్రవేత్తలు(Young Scientists) పాల్గొనే ఈ ఎక్స్‌ఫోకు సహకరించాలని కోరారు. ఎయిర్‌షోకు అవసరమైన అను మతులతో పాటు సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు, భారత వైమానిక దళ విమానాలు పాల్గొనేలా రక్షణ శాఖ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశా రు.

వీటితో పాటు భూ, నౌకా, వైమానిక దళాలకు చెం దిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రదర్శనలో ఏర్పాటు చేయాలని, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, ఎండీఎల్ తదితర రక్షణ రంగ సంస్థలు, డీఆర్డీవో ప్రయోగశాలలు కూడా ఎక్స్‌ఫోలో పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించాలని కేంద్ర మంత్రిని కోరారు.

విదేశీ రక్షణ శాఖ ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు రక్షణ శాఖ సహకారం అవసరమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రక్షణ ఎక్స్‌ఫోకు స్వాగతం పలికేందుకు తమ ప్రభుత్వం ఎదు రుచూస్తోందన్నారు. అదే విధంగా ఆదిలాబాద్ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూ సేకరణ చేస్తోందని, రక్షణ శాఖ వినతి మేరకు మరో 750 ఎకరాలు కూడా ఇస్తామని స్పష్టం చేశారు.  

దేవరకద్రలో రక్షణ పరిశోధన

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్డీఎల్) ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఇప్పటికే టీజీఐఐసీ అంగీకరించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎకరానికి కాకుం డా మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం రూ.1 నా మమాత్రపు లీజు అద్దెతో 33 ఏళ్ల కాలానికి భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు.

అవసరమైతే దానిని మరో రెండుసార్లు లీజు పొడిగించుకునే అవకాశం ఉం దని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర శక్తి శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి, ఎంపీలు ఎం.అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, పోరిక బలరాంనాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ పాల్గొన్నారు.

పౌర విమానయాన శాఖ మంత్రితో ముఖ్యమంత్రి భేటీ 

ఆదిలాబాద్, మామునూరు (వరంగల్) విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలని పౌర విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మామూనురు ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూ సేకరణను పూర్తి చేసి ఇచ్చామని తెలిపారు. ఢిల్లీలోని పౌర విమానయా న శాఖ కార్యాలయం రాజీవ్‌గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో బుధవారం సమావేశమయ్యారు.

ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాలింగ్) వసతులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్‌లో రన్ వే ఫైనలైజేషన్‌కు సంబంధించి రక్షణ, పౌర విమానయన శాఖల సం యుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. మామునూరు ఎయిర్‌ఫోర్ట్ టెండర్లను రెండు వారాల్లో పిలిచి డిసెంబరు నాటికి ఖరారు చేసి పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

తెలంగాణలో ఛాపర్ల ద్వారా హెలీ టూరి జం అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. హుస్సేన్‌సాగర్‌లో సీ ప్లేన్ ల్యాండింగ్‌కు సంబం ధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర వి మానయాన శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. సీఎం వెంట ఎంపీలు సురేశ్ షెట్కార్, ఎం.అనిల్‌కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్ ఉన్నారు.