3 September, 2026 | 2:56 AM

సాదాబైనామాల పేరుతో వసూళ్లు!

03-09-2026 | 01:12am
  1. ఎకరానికి 23 వేల నుంచి 26 వేల వరకు ఫీజులు 
  2. పాసు పుస్తకాలు ఇవ్వకుండా రైతులను రోడ్డున పడేస్తున్న సర్కారు
  3. ఆర్టీసీని అప్పుల ఊబిలోకి నెట్టిన సీఎం
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): సాదాబైనామా(simple sale agreements) పేరుతో రైతుల(farmers) నుంచి అధికారులు ఫీజులు వసూలు(fees collection) చేస్తున్నారని, పాస్ పుస్తకాలు(Passbooks) ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని రోడ్డున పడేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) విమర్శించారు. మక్తల్ రైతులు(Maktal farmers) బుధవారం తనను కలిసి ఆవేదన వ్యక్తం చేయడంతో.. హరీశ్‌రావు(Harish Rao) ఎక్స్ వేదిక(X Platform)గా స్పందించారు. సొంత భూమి కోసం మక్తల్ నియోజకవర్గ(Maktal constituency) రైతులు పడుతున్న అవస్థలే.. ఈ కాంగ్రెస్ సర్కార్ చేతకానితనానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

ఎకరానికి రూ.23 వేల నుంచి రూ.26 వేల వరకు ఫీజులు కట్టించుకుని నెలలు గడుస్తున్నా.. రైతుల భూముల(Farmers lands) వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదన్నారు. చేతిలో 13-బి సర్టిఫికెట్లు ఇచ్చి భూభారతి పోర్టల్‌(Bhubharati Portal)లో సాంకేతిక సమస్య(Technical issue) ఉన్నదని, పైనుంచి ఆదేశాలు రావడం లేదని ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ రైతులను తిప్పుతున్నారని మండిపడ్డారు. ‘పాస్ పుస్తకం లేదు. ఆన్‌లైన్‌లో పేరు లేదు.

ఫలితంగా రైతుబంధు అందడం లేదు, రైతుబీమా వర్తించడం లేదు, ఎరువులు పొందడంలో ఇబ్బందులు.. చివరకు పండించిన పంటను అమ్ముకునే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారు’ అని మండిపడ్డారు. 62 వేల మంది రైతుల నుంచి ఫీజులు ముక్కుపిండి వసూలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారి భూములకు సంబంధించిన రికార్డులను ఎందుకు క్లియర్ చేయడం లేదు? రైతులు డబ్బులు చెల్లించిన తర్వాత కూడా వారి భూమి హక్కులను ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు.

ధరణి (Dharani)స్థానంలో భూభారతి(Bhubharathi) తెస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు భూమి రికార్డుల విషయంలో రైతులను మరింత గందరగోళానికి గురిచేస్తోందన్నారు. సాంకేతిక సమస్యల పేరుతో ఆన్‌లైన్  ప్రక్రియ నిలిచిపోవడం, అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడం రైతుల్లో అనేక అనుమానాలకు తావిస్తోందని, రైతుల భూములకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే.. వారి భూమి హక్కులను ప్రశ్నార్థకంగా మార్చడం దుర్మార్గమన్నారు.

వెంటనే భూభారతి పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని,  సాదాబైనామా క్రమబద్ధీకరణకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులన్నింటినీ యుద్ధప్రాతిపదికన క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. 

ఆర్టీసీ లాభాలు కాగితాల మీదేనా?

‘వేదికల మీద సీఎం రేవంత్‌రెడ్డి.. ఆర్టీసీ వేల కోట్ల లాభాల్లో ఉందని గొప్పలు చెపుతారు.. కానీ ఆర్టీసీ ఎండీ మాత్రం ప్రభుత్వం నుంచి రూ.2,600 కోట్ల బకాయిలు రావాలని లేఖ రాస్తారు. కాగితాల మీదే ఆర్టీసీ లాభాల్లో ఉందంటారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఉద్యోగులు, విశ్రాంత కార్మికుల జీవితాలను అప్పుల ఊబిలోకి నెట్టారు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రచార ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులకు పీఆర్సీ, ఏరియర్స్ అందడం లేదని, 30-40 ఏళ్ల పాటు ఆర్టీసీకి సేవ చేసిన సుమారు 18 వేల మంది విశ్రాంత ఉద్యోగులకు నేటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం దారుణమని మండిపడ్డారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే 400 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోందన్నారు. ఇప్పటికైనా రూ.2,600 కోట్ల ప్రభుత్వ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, 18 వేల మంది విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ ఏరియర్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.