ఒకరోజు అరక అద్దె @3000
కాడెడ్లు కరువు రైతు బ్రతుకు బరువు.
బోథ్, జూలై 6 (విజయక్రాంతి): వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతులకు(farmers) వ్యవసాయం భారంగా మారింది. పంట పెట్టుబడును పెరగడంతో పాటు ఎరువుల ధరలు తిరగడంతో పాటు కూలీలు దొరకక వ్యవసాయ రంగం(Agricultural Sector) తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయింది. దీంతో రైతులు వ్యవసాయం చేయాలంటేనే సతమతమగుతున్నారు.
పంటలకు మద్దతు ధర పెరిగిన లాభం లేదు
రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధరలు పెంచుతున్న తమకు ఏమాత్రం లాభం లేదని రైతులు వాపోతున్నారు. కూలీల రేట్లు ఈ ఏడాది అమాంతం పెరిగిపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. మహారాష్ట్ర నుండి కూలీలు రాకపోతే వ్యవసాయం చేయడం కష్టంగా మారిందని వాపోతున్నారు. మరోవైపు పంట పెట్టుబడి పెరగడం సరియైన టైంలో కూలీలు దొరకకపోవడం వల్ల పంటల సాగు కష్టంగా మారింది అంటున్నారు. ప్రకృతిని ఎదిరించి పంటలు సాగు చేస్తే ధాన్యం ఇంటికి వచ్చేవరకు ఇబ్బందికరంగానే ఉందని అంటున్నారు. పంట సాగుకు అప్పులు పుట్టక రైతులు వ్యవసాయం దండగ అనే స్థాయి చేరుకున్నారు.
కనుమరుగవుతున్న కాడెడ్లు
వ్యవసాయంలో రైతన్నకు చేదోడు వాదోడుగా ఉండే ఎడ్ల సంఖ్య ఏడాదికి ఏడాది తగ్గిపోతుండడంతో దౌరా కొట్టడం కలుపు మొక్కలు తీయడం కష్టంగా మారింది. పంట పెరిగిన సమయంలో కలుపు మొక్కల నివారణకు దౌరా కొట్టేందుకు కాడెడ్లు తప్పనిసరి అయితే ఈ ఏడాది కలుపు మొక్కల నివారణకు దౌర కొట్టించాలంటే అరకతో పాటు మనిషి వస్తే మూడు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని రైతులంటున్నారు. దీంతో తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటాను సాగు చేసుకుంటున్నాం అన్నారు ఒకరోజు చేలలో కలుపు మొక్క నివారణకు దౌరా పుట్టించాలంటే మూడు వేల రూపాయలకు తక్కువగా తీసుకోవడం లేదని కాబోతున్నారు ఏది ఏమైనా పెరిగిన పెట్టుబడులతో వ్యవసాయ రంగం కుదేలుగా మారనున్నది






