3 September, 2026 | 3:02 AM

క్రాంతదర్శి వైఎస్‌ఆర్

03-09-2026 | 01:34am
  1. రైతుల పక్షపాతి.. సంక్షేమ ప్రదాత 
  2. ఉచిత కరెంట్, రుణమాఫీతో రైతుల గుండెల్లో నిలిచారు
  3. సాగునీటి ప్రాజెక్టులతో అన్నదాతకు భరోసా 
  4. రాహుల్‌ను ప్రధానిని చేయడమే వైఎస్ ఆశయం   
  5. ఢిల్లీలో వైఎస్‌ఆర్ అవార్డు ప్రదానోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

* రైతులకు ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్‌ఆర్. రూ.1,300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో  రారాజుగా నిలిచారు. ప్రాణహిత-చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్‌ఆర్‌దే.

- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(united Andhra Pradesh) దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(Dr. Y.S. Rajasekhara Reddy,)  రైతు సంక్షేమమే(farmer welfare) ధ్యేయంగా పాలన సాగించారని పలువురు నేతలు కొనియాడారు. ఉచిత విద్యుత్(free electricity), రుణమాఫీ(loan waiver), సాగునీరు(irrigation water), రైతు కుటుంబాల(farmer families)కు వైద్యం(healthcare), విద్య వంటి పథకాలతో వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన క్రాంతదర్శి వైఎస్‌ఆర్ అని కీర్తించారు. వైఎస్ ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఢిల్లీలో బుధవారం కేవీపీ, వైఎస్‌ఆర్ ఫౌండేషన్(KVP, YSR Foundation) ఆధ్వర్యంలో.. కాన్ట్సిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి, అవా ర్డ్స్-2026 కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీఎం రేవంత్‌రెడ్డి, కేవీపీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవార్డును ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ బతికున్నంతకాలం రైతుల కోసం పరితపించారని పేర్కొన్నారు. ‘వైఎస్ అభిమానులకు ఒక మాట గుర్తు చేస్తున్నా. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే జీవిత లక్ష్యం’అని చెప్పినట్లు గుర్తు చేశారు. ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారని, రాహుల్‌గాంధీని దేశానికి ప్రధా ని చేయడమే వైస్‌కు నిజమైన నివాళి అన్నారు.

‘దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడు అండగా నిలబడాలి. అండగా నిలబడాల్సిన చారిత్రక సందర్భం ఈరోజు ఈ దేశానికి అవసరం. దేశానికి బలమైన నాయకుడు రాహుల్‌గాంధీ మాత్రమే. అందుకు మీ అందరి మద్దతు అవసరం. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో మనమంతా కలిసి కష్టపడి రాహుల్‌గాంధీని ప్ర ధాని చేసుకుందాం’ అని పిలుపునిచ్చారు.

రైతులకు ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్‌ఆర్ అని, రూ.1300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో  రారాజుగా నిలిచారని కొనియాడారు. ప్రాణహిత కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్‌ఆర్‌దేనన్నారు. ‘వైఎస్ ప్రారంభించిన ప్రాణహి త ఎస్‌ఎల్ బీసీ పథకాలు ఇప్పుడు ఆగిపోయాయి. వాటిని పూర్తి చేసి తెలంగాణ సమాజా నికి అంకితమిస్తాం’ అని సీఎం తెలిపారు.

దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని, నెహ్రూ ముందు చూపుతో దేశం ఆకలి కేకల నుం చి ఆహార ఎగుమతుల వరకు చేరుకుందని పేర్కొన్నారు. దేశంలో మొదటిసారిగా రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించే చర్యలు చేపట్టిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందన్నారు.

వ్యవసాయ చట్టం తీసుకొచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంచిన చరిత్ర  కూడా ఆమెదేనన్నారు. దేశంలో ప్రతీ ఒక్కరికీ ఆహారభద్రత కల్పించాలని సోనియాగాంధీ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. పీడీఎస్ విధానం తీసుకో తీసుకొచ్చి రేషన్ షేప్ ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ సొంతమని, తెలంగాణలో 3.48 కోట్ల  మందికి సాంబ బి య్యం అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.  

రైతుల పక్షపాతి వైఎస్‌ఆర్: ఖర్గే 

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏపీలో సీఎల్‌పీ నేతగా ఉంటే తాను కర్ణాటకలో సీఎల్పీ నేతగా ఒకేసారి ఉన్నామని ఏఐసీసీ అధ్యక్షులు మలికార్జున ఖర్గే అన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్ కృషి ఎంతో ఉందన్నారు. 1400 కిలో మీటర్ల పాదయాత్ర చేశారని తెలిపారు. ఏపీ నుంచి 39 మంది ఎంపీలను గెలిపించారని గుర్తు చేశారు. 

వైఎస్‌ఆర్ సేవలు చిరస్మరనీయం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వ్యవసాయ రంగానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, స్వామినాథన్ అందించిన సేవలు చిరస్మరణీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయ రంగానికి స్వామినాథన్ శాస్త్ర సాంకేతిక ఫలాలను అందిస్తే.. రాజశేఖర్‌రెడ్డి మాత్రం రైతులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు, రుణాలు అందించడంతో పాటు వారి కుటుంబాలకు వైద్యం, విద్యను చేరువ చేసి రైతు సంక్షేమానికి తన పాలనలో ప్రధాన భాగంగా మార్చారని తెలిపారు.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రఘువీరారెడ్డి అధ్యతక్షత వహించగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్  సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ కాంగ్రనెస్ నాయకులు గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.