పోంచర్ల పోచమ్మ జాతరకు వేళాయే..
- పోచమ్మే ముత్యాలమ్మగా ప్రసిద్ధి. తెలంగాణలో ఇదే రెండో పెద్ద బోనాల జాతర
- శతాబ్దాల కాలంగా ప్రతి ఏడాది శ్రావణమాసంలో జాతర ఆనవాయితీ
- ఈ ఏడాది జాతరకు సర్వం సిద్ధం
- నాటి పొంచర్లే.. నేటి హుజూర్ నగర్
- మూడు రోజులపాటు సాగనున్న జాతర
- ముస్తాబైన గ్రామదేవతల ఆలయాలు
- పూజలందుకోనున్న పోచమ్మ, ముత్యాలమ్మ, మద్దిరావమ్మ, అంకమ్మ, మహాలక్ష్మమ్మ దేవతామూర్తులు
హుజూర్నగర్, సెప్టెంబర్ 2: పట్టణంలోని ఊరచెరువు(Village tank)లో ఎన్నో దశాబ్దాల క్రితం పోచమ్మ తల్లి(Goddess Pochamma) కొలువుతీరింది. పోచమ్మతల్లి పేరు మీదనే ఆనాడు పోంచర్ల గ్రామం(Poncharla Village)గా రికార్డుల్లో నమోదైంది. నైజాం నవాబులకాలం లో పోంచర్ల కాస్తా హుజూర్నగర్గా మార్పు చెందింది. హైదరాబాద్(Hyderabad) కేంద్రంగా రాష్ట్రం ఏర్పడినప్పుడు హుజూర్ అనే నవాబు ఈ ప్రాంతాన్ని పరిపాలించగా హుజూర్నగర్గా పేరు మారింది.
మూడు రోజులు మురిపెంగా జాతర
ముత్యాలమ్మ జాతరకు ఈ నెల 6,7, 10 తేదీల్లో పెద్ద, చిన్న ముత్యాలమ్మలతో పాటు కనకదుర్గమ్మ జాతరను నిర్వహించనున్నా రు. ఇక్కడ పోచమ్మతల్లి ముత్యాలమ్మగా ప్ర సిద్ధి. పెద్దముత్యాలమ్మ, చిన్నముత్యాలమ్మ లో పాటు కనకదుర్గమ్మ జాతర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రభ బం డ్లతో రైతుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా ని లవనుంది. జాతర సందర్భంగా దేవాలయా న్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో పెద్ద జా తర్లలో ఒకటిగా హుజూర్నగర్ ముత్యాలమ్మ జాతరకు పేరుంది.జాతర సందర్భంగా చల్లగూడుఎత్తే కార్యక్రమాలు ప్రారంభ మయ్యాయి.
మూడు రోజులు కార్యక్రమాలు ఇలా
ఈనెల 6తేదీన పెద్ద ముత్యాలమ్మ (పోచమ్మతల్లి),7వ తేదీన చిన్న ముత్యాలమ్మ, అనంతరం 10వ తేదీన కనకదుర్గమ్మకు ప్రభలు కట్టి ఘనంగా జాతర నిర్వహించనున్నారు.ప్రతి రోజూ జాతరకు లక్షమంది భక్తులు తరలిరానున్నారు. శతాబ్దాల కాలం గా ప్రతి ఏడాది శ్రావణమాసంలో పోచమ్మ తల్లికి, ముత్యాలమ్మ, మద్దిరావమ్మ, అంక మ్మ, మహాలక్ష్మమ్మ దేవతా మూర్తులు పూజలందుకోవడం ఆనవాయితిగా వస్తోంది.ఈ దేవాలయాలకు ఎంతో చరిత్ర ఉంది.
ఇదీ హుజూర్నగర్ (పోంచర్ల) చరిత్ర
పోచమ్మతల్లి విగ్రహాన్ని కొంతమంది హుజూర్నగర్ (పోంచర్ల) గ్రామం మీదుగా ఎడ్లబండిపై తీసుకు వెళ్తుండగా బండి శిరస్సు విరిగిందట.భక్తులు బండిని సరిచేస్తుండగా తాను ఇక్కడే పోంచర్ల గ్రామంలో కొలువుతీరుతానని, భక్తుల కోర్కెలు తీరుస్తానని పోచమ్మ తల్లి పలికిందట.దీంతో భక్తులు ఆ విగ్రహాన్ని వదిలివెళ్లారట. పోచమ్మతల్లిగా,ముత్యాలమ్మ తల్లిగా కొలువుతీరానని గ్రామ పెద్దల కలలోకి రావడంతో పట్టణంలో ముత్యాలమ్మ గుడి నిర్మించినట్లు పెద్దలు చెబుతున్నారు.
అప్పటి నుంచి ప్రతి ఏడాది శ్రావణమాసంలో ముత్యాలమ్మ తల్లి కి రైతులు ప్రభలతో ప్రదర్శన చేసి,బోనాలు సమర్పించి, మేకలు, గొర్రెలు, కోళ్లను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అంతకుముందే గ్రామంలో ముత్యాలమ్మతల్లి ఉండ గా ఆమెను మరొక చోట ప్రతిష్ఠించి ఆదేవతను చిన్న ముత్యాలమ్మ తల్లిగా, పోచమ్మను పెద్దముత్యాలమ్మగా నామకరణం చేస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
చిన్నముత్యాలమ్మ దేవాలయంలో ముత్యా లమ్మతో పా టు మద్దిరావమ్మ, అంకమ్మ దేవాలయాలను నిర్మించగా పెద్దముత్యాలమ్మ దేవాల య ఆవరణలో పోచమ్మతల్లి, మహా లక్ష్మ మ్మ, మద్దిరావమ్మ ఆలయాలు నిర్మించి పూ జలు చేస్తున్నారు. గుడి ఎదుట పోతురాజు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.పోచమ్మ దేవాలయ నిర్మాణం అనంతరం కొంతమంది దొంగలు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి వజ్రవైఢూర్యాలను అపహరించు కుపోతుండగా దేవాలయానికి పక్కనే ఉన్న చెరువుకట్ట ఎక్కే సమయానికి దొంగలు రక్తం కక్కుకుని చనిపోయారని గ్రామ పెద్దలు తెలుపుతున్నరు.
దీంతో వారికి అక్కడ సమాధులు నిర్మించినట్టు తెలుపుతున్నారు.భారీ పోలీస్ బందోబస్తు నడుమ జాతరకు సర్వంసిద్ధం:ఒంగోలు జాతి గిత్తలతో ప్రభల ఊరేగింపు,పోటీ ప్రదర్శన నిర్వహించడం ఆనవాయితీ. ముత్యాల మ్మ జాతరకు హుజూర్ నగర్ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో ముత్యాలమ్మ జాతరకు ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.ఇప్పటికే ముత్యాల మ్మ జాతర ఏర్పాట్లపై అధికార యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.






