3 May, 2026 | 2:36 AM

జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు

03-05-2026 01:17 AM

లక్ష్మీనరసింహ ఆలయ అభివృద్ధికి కృషి

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

ఖిలావనపర్తి రథోత్సవంలో పాల్గొన్న మంత్రి 

పెద్దపల్లి/ధర్మారం, మే 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గ్రామంలో నిర్వహించిన శ్రీలక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ శనివారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల క్యాబినెట్ సమావేశంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశం చర్చకు వచ్చిందన్నారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కోరిన కోరికలు తీర్చే లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని మంత్రి తెలిపారు.

2011- లో ఖి థర్మల్ పవర్ స్టేషన్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రయత్నించగా జెడ్పీ చైర్మన్‌గా తాను అడ్డుకొని గ్రామంలో ఒక గజ స్థలం పోకుండా కాపాడానని మంత్రి గుర్తు చేశారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ప్రత్యేక రథం తయారు చేయించాలని ఇందుకు సహకరిస్తానని మం త్రి హామీ ఇచ్చారు. ఆలయంలో డైనింగ్ హాల్ నిర్మాణానికి ఇప్పటికే రూ. 15 లక్షలు నిధులు విడుదల చేశామని మరో రూ.10 లక్షలు నిధులు విడుదల చేసి హాల్ నిర్మాణం పూర్తి అయ్యే లా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.