3 May, 2026 | 2:36 AM

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

03-05-2026 01:13 AM
  • గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు 
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం/దుమ్ముగూడెం, మే 2 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతంలో ప్రతి గిరిజన కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం దృడ నిశ్చయంతో ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూ డెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, దుమ్ముగూడెం మండలం బండిరేవులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగు లేటి మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతా ల విద్యార్థులకు నాణ్యమైన, సమగ్ర విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదన్నారు. యంగ్ ఇండియా పథకం కిం ద నిర్మించనున్న ఈ రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా విద్యార్థులకు విద్యతో పాటు వసతి, పోషకాహారం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి అన్ని సౌకర్యాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఈ పాఠశాల నిర్మాణం పూర్తయిన అనంతరం స్థానికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి వారి భవిష్యత్తు కు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు.అనంతరం దుమ్ముగూడెం మండలం లోని చింతగుప్ప గ్రామం నుంచి బురదమడు గు వరకు బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ములకపాడు గ్రామం లోని మినీ స్టేడియంలో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్‌తో కూడిన మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

గ్రామీణ యువతలో క్రీడా చైతన్యాన్ని పెం పొందించేందుకు ప్రభుత్వం క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల సంక్షేమంపై మాట్లాడుతూ ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహిస్తూ వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు.

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దుమ్ముగూడెం మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగ కరంగా నిలుస్తాయని తెలిపారు. యంగ్ ఇండి యా పాఠశాల, రహదారి, క్రీడా వసతుల అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్య, రవా ణా, క్రీడా రంగాల్లో పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం ద్వారా జిల్లాలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. ఈ పాఠశాలలో సుమారు 2,000 నుండి 2,500 మంది విద్యార్థులు ఒకేచోట విద్యనభ్యసించే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు. కార్యక్రమాలలో ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణల్ శ్రేష్ఠ సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.