విద్యార్థులను అభినందించిన మంత్రి అడ్లూరి
02-05-2026 07:46 PM
ప్రభుత్వ పాఠశాలల ఫలితాలపై హర్షం వ్యక్తం
ధర్మపురి,(విజయక్రాంతి): ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఎండపల్లి మండలంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన సహర్షిత, సంజన, రేఖలను తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ మంత్రి అడ్లూర్రి లక్ష్మణ్ కుమార్ శనివారం అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలనీ ఆయన ఆకాంక్షించారు.ప్రభుత్వ పాఠశాలల ఫలితాలపై ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ విద్యార్థులను అభినంధించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థుల తల్లిదoడ్రులను జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా అభినందించారు.






