మెస్సి అల్విదా
- అంతర్జాతీయ ఫుట్ బాల్‌కు వీడ్కోలు
- ప్రపంచ కప్ ఫైనల్‌తోనే నిర్ణయం
- ఇన్ స్టాగ్రామ్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటన
- 21 ఏళ్ల కెరీర్‌కు ముగింపు
- 6 ప్రపంచ కప్‌లు ఆడిన అర్జెంటీనా దిగ్గజం
బ్యూనస్ ఎయిర్స్, ఆగస్టు 31: సాకర్ అభిమానులకు షాకింగ్ న్యూస్... అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. 2026 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
ఇది నా హృదయాన్ని ఎంతో బాధించే నిర్ణయమే అయినా, జాతీయ జట్టు నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని మెస్సీ పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. గత 20 ఏళ్లుగా తనకు అండగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, సహచర ఆటగాళ్లకు మెస్సి కృతజ్ఞతలు తెలిపాడు. అర్జెంటీనా జట్టు తరఫున ఆడిన ప్రతి క్షణాన్ని గర్వంగా భావిస్తున్నానని, ఇకపై బయటి నుంచి జట్టును సపోర్ట్ చేస్తానని మెస్సి పేర్కొన్నాడు.
రెండు దశాబ్దాల ప్రస్థానం
మెస్సీ జాతీయ జట్టును వీడటం ఫుట్‌బాల్ ప్రపంచంలో ఒక సువర్ణ శకానికి ముగింపు పలికినట్టయింది. 2005లోప్రారంభమైన మెస్సి అద్భుతప్రయాణంరెండు దశాబ్దాలకు పైగా కొనసాగింది. అర్జెంటీనా తరఫున 207 మ్యాచ్‌లు ఆడి 125 గోల్స్ సాధించిన మెస్సీ, 2022లోఅర్జెంటీనాకు ప్రపంచకప్ అందించి చిరస్థాయిగా నిలిచాడు. కోపా అమెరికా టైటిల్స్, 2008 బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణపతకం కూడా మెస్సి ఖాతాలో ఉన్నాయి.
వ్యక్తిగతంగా మెస్సీ రికార్డు స్థాయిలో 8 బాలన్‌డి’ఓర్ అవార్డులు గెలుచుకున్నాడు. బార్సిలోనా తరఫున 10 లాలిగా టైటిల్స్, 4 ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలు సాధించి క్లబ్ ఫుట్‌బాల్‌లో చెరగని ముద్ర వేశాడు. పీఎస్జీతోఫ్రెంచ్ లీగ్ టైటిల్స్ గెలిచి, ప్రస్తుతం ఇంటర్ మియామీ తరఫున తన క్లబ్ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. అర్జెంటీనాలోని రొసారియోలో సాధారణ కుటుంబంలో జన్మించిన మెస్సీ, చిన్నతనంలోఎదుగుదలకు సంబంధించిన హార్మోన్ సమస్యతో బాధపడ్డాడు. ఎన్నో సవాళ్లను అధిగమించి బార్సిలోనా అకాడమీలో చేరి ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యున్నత స్థాయికి ఎదిగాడు.
అర్జెంటీనా జట్టుతోఎన్నో ఓటములు, నిరాశలు ఎదుర్కొన్న మెస్సీ ఒకదశలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు కూడా ప్రకటించాడు. అయితే తిరిగి జట్టులో చేరికోపా అమెరికా, చివరకు 2022 ప్రపంచకప్‌ను గెలిచి కోట్లాది మంది అభిమానుల కలను నిజం చేశాడు. ఆటతో పాటు ప్రకటనలు, వ్యాపార ఒప్పందాలు, పెట్టుబడుల ద్వారా మెస్సీ ప్రపంచంలోఅత్యధిక ఆదాయం పొందిన క్రీడాకారుల్లో ఒకరిగా ఉన్నాడు. మెస్సి రిటైర్మెంట్ నిర్ణయం కోట్లాది మంది సాకర్ ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. అయితే రెండు దశాబ్దాల పైగా సాగిన కెరీర్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేసిన మెస్సి సాకర్ ప్రపంచంలో దిగ్గజంగా నిలిచిపోయాడు.






