1 September, 2026 | 1:30 AM

తిలక్ వర్మ శతకం

01-09-2026 01:10 AM

తెలుగు తేజం కెప్టెన్ ఇన్నింగ్స్

దులీప్ ట్రోఫీ సెమీఫైనల్

బెంగళూరు, ఆగస్టు 31: హైదరాబాదీ క్రి కెటర్ తిలక్ వర్మ రెడ్ బాల్ క్రికెట్‌లోనూ అదరగొడుతున్నాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్‌లో సౌత్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తిలక్ వర్మ అద్భుత సెంచరీతో అదరగొట్టా డు. సౌత్ జోన్ జట్టు 80 పరుగులకే 5 వికె ట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో, శ్రేయ స్ గోపాల్ (88)తో కలిసి ఆరో వికెట్‌కు 175 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.

తిలక్ వర్మ 225 బం తుల్లో 7 ఫోర్లతో 106 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తిలక్ వర్మ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో ఇది 8వ సెంచరీ. తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ కారణంగా సౌత్ జోన్ తొలి ఇన్నిం గ్స్‌లో 90 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మరోవైపు సౌత్ జోన్ బౌలర్ విద్వత్ కావేరప్ప (4/66) విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్‌ను 195 పరుగులకే ఆలౌటైంది. సౌత్ జోన్ మూడోరోజు ఆట ముగిసే సరికి 285/9 స్కోరు చేసింది.