8, 9 తేదీల్లో మెగా మహిళా రైతు మేళా
పీజేటీఏయూ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య
హైదరాబాద్, మార్చి2 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలం గాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 8, 9 తేదీల్లో మెగా మహిళా రైతు మేళా ని నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ, కోరమాండల్ ఇంటర్నేషనల్‌లు ఈ కార్యక్రమ నిర్వహణకి సంబంధించి సోమవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ సమీక్ష నిర్వహించ గా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ఉద్యాన శాఖ సంచాలకులు యాష్మీన్‌బాషా, పీజేటీఏయూ వీసీ జానయ్య పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం గతం లో ఎన్నో రైతు మేళాలని నిర్వహించినప్పటికీ వ్యవసాయంలో మహిళల కీలక పాత్రని గుర్తించి తొలిసారిగా మహిళా రైతు మేళాని నిర్వహిస్తున్నట్లు జానయ్య వివరించారు.
మహిళా రైతుల సాధికారిత లక్ష్యంగా నిర్వహించనున్న ఈ మేళాకి సుమా రు 8 నుంచి 10 వేల మంది మహిళా రైతులు హాజరవుతారని జానయ్య పేర్కొన్నారు. రాష్ట్ర గ్రామీ ణాభివృద్ది శాఖ పరిధి లోని సెర్ప్‌కి చెందిన సుమారు మూడు వేల మంది మహిళా రైతులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని జానయ్య వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వ్యవసాయం, అను బంధ శాఖలన్నీ పూర్తిగా సహకరించాలని సురేంద్ర మోహన్ సూచించారని జానయ్య వివరించారు.




