3 March, 2026 | 4:25 AM

కన్నులపండువగా డోలా పౌర్ణిమ

03-03-2026 01:05 AM

ఒడిశా సంప్రదాయంలో రాధాకృష్ణుల ఊరేగింపు

నగరంలో తొలిసారిగా ఇస్నాపూర్ జగన్నాథ్ మందిర్ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవం

మణికొండ, మార్చి 2, విజయక్రాంతి: రాధాకృష్ణుల దైవప్రేమకు ప్రతీకగా నిలిచే డోలా పౌర్ణిమ వసంతోత్సవాన్ని నగరంలో తొలిసారిగా ఇస్నాపూర్ జగన్నాథ్ మందిరం కమిటీ ఆధ్వర్యంలో కన్నులపండువగా నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ ఉత్సవం లో వేలాదిగా పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదాలతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు అత్యంత వైభవంగా చేశామని నిర్వాహక కమిటీ అధ్యక్షుడు నబజ్యోతి పాణిగ్రహి, కార్యదర్శి గౌరంగ్ మహంతి, కోశాధికారి ప్రదీప్ సాహు తెలిపారు.

ఒడిశా, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఫాల్గుణ మాసపు పౌర్ణమి నాడు డోలా పౌర్ణిమ జరుపుకోవడం ఆనవాయితీ. అదే సంప్రదాయాన్ని హైదరాబాద్ నగరంలో సైతం భక్తిశ్రద్ధలతో కొనసాగించారు. పూర్తి ఒడిశా సంప్రదాయ పద్ధతిలో కమిటీ సభ్యుల ఇళ్లకు వెళ్లి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుక ల్లో పాల్గొన్న భక్తజనులకు స్థానికులు సాదరంగా స్వాగతం పలికారు. సంబరాల్లో పా ల్గొన్న వారిలో దిలీప్ కక్కడ్, అందె లక్ష్మణ్ రావు, బత్తుల బాపూజీ, రంగాచారి, నాగేం ద్ర రావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కమిటీ సభ్యులు శ్రద్ధానంద మహంతి, రమాకాంత్ సాహు తదితరులు కీలక పాత్ర పోషించారు.