బంగాల్ గద్దెపై సువేందు
అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం
మార్మోగిన జై శ్రీరామ్, మోదీ.. మోదీ నినాదాలు
- కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ కాషాయ సంద్రం
- మిన్నంటిన హర్షధ్వానాలు
- రవీంద్రనాథ్ ఠాగూర్‌కు నివాళి
- సువేందుతో సహా ఆరుగురు మంత్రుల ప్రమాణం
- హాజరైన ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, బీజేపీ అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల సీఎంలు
- సభావేదికపై 98 ఏళ్ల బీజేపీ కురువృద్ధుడు మఖన్‌లాల్ సర్కారుకు మోదీ పాదాభివందనం
* స్వతంత్ర భారత చరిత్రలో.. మొదటిసారిగా పశ్చిమ బంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. జెయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్న సువేందు అధికారి బంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు ఐదుగురు మంత్రులు.. దిలీప్ ఘోష్, అగ్నిమిత్రాపాల్, అశోక్ కీర్తనియా, నిసిత్ ప్రామాణిక్, క్షుదిరామ్ టుడు కూడా ప్రమాణం చేశారు.
కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో సువేందు అధికారి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్యతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్‌షో నిర్వహించారు. అక్కడికి లక్షలాది మంది కార్యకర్తలు, బీజేపీ అభిమానులు తరలివచ్చారు. రోడ్‌షోలో ప్రధాని మోదీ ప్రజలకు చేతులు ఊపుతూ.. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌కు వస్తుండగా ‘జై శ్రీరామ్.. మోదీ.. మోదీ..’ నినాదాలు మార్మోగాయి.
బెంగాలీ జానపద నృత్యాలతో అశేష జనవాహిని మోదీకి ఘనస్వాగతం పలికింది. ప్రముఖ బంగాల్ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ‘ఇది చారిత్రాత్మక రోజు. టీఎంసీ కోరల నుంచి బంగాల్ స్వాతంత్య్రం పొందడాన్ని చూసేందుకు మేం వచ్చాం’ అని జార్ఖండ్‌కు చెందిన ఒక బీజేపీ అభిమాని పేర్కొన్నాడు.
బంగాల్ గడ్డపై కొలువైన బీజేపీ తొలి ప్రభుత్వం
కోల్‌కతా, మే 9 : పశ్చిమ బంగాల్ చరిత్ర లో సరికొత్త మొదలైంది. బంగాల్ గడ్డపై మొట్టమొదటి బీజేపీ సర్కారు కొలువుదీ రింది. సీఎం సువేందు అధికారి ప్రమాణ స్వీకారమహోత్సవం అట్టహాసంగా జరిగిం ది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, కాబోయే సీఎం సువేందు అధికారి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కలిసి భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రధాని మోదీ అక్కడికి తర లొచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు, బీజేపీ అభిమానులు, ప్రజలకు చేతులు ఊపుతూ.. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌కు వస్తుండగా ‘జై శ్రీరామ్.. జై శ్రీరామ్, మోదీ.. మోదీ..’ నినాదాలు మార్మోగాయి.
బెంగాలీ జానపద నృత్యాలు, అశేష జనవాహిని, కాషాయ సం ద్రం మోదీకి ఘనస్వాగతం పలికాయి. ఈ అద్భుతాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి తరలొ చ్చిన లక్షలాదిజనం తమతమ ఫోన్లలో బం ధిస్తూ.. హర్షధ్వానాలు చేశారు. ఈ సంద ర్భంగా ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వేదికపైకి వచ్చిన మోదీ ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేయడంతో సభాప్రాంగణం హోరెత్తింది. కరతాల, హర్షధ్వానాలతో మా ర్మోగిపోయింది.
సభావేదికపై 98 ఏళ్ల బీజేపీ కురవృద్ధుడు మఖన్‌లాల్ సర్కార్ కాళ్లను మోదీ మొక్కి, ఆలింగనం చేసుకుని, ఆశీ ర్వాదం తీసుకున్నారు. దీంతో మళ్లీ ముఖ్య అతిథులతోపాటు జనసంద్రం పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. తర్వాత బంగాల్ బీజేపీ మొదటి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి చేత బెంగాల్ గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రమాణం చేయించారు.
ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్ర మం త్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సిం గ్, రామ్మోహన్‌నాయుడు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యనాథ్, రేఖాగుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తదితరులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 55 ఏళ్ల సువేందు.. బెంగాల్‌కు 9వ సీఎం.
ఆయనతో పాటు బీజేపీ నేతలు దిలీప్ ఘోష్, అగ్నిమిత్రాపాల్, అశోక్ కీర్తనియా, నిషిత్ ప్రామాణిక్, క్షుదిరామ్ తుడు మం త్రులుగా ప్రమాణం చేశారు. మాజీ ఈసీఐ ఎన్నికల పరిశీలకుడు సుబ్రతా గుప్తాను సీఎం సువెందు అధికారికి సలహాదారుగా నియమితులయ్యారు. అంతుకుముందు ప్రముఖ బెంగాల్ కవి, జాతీయ గీతం జనగణమన గేయ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.
కాషాయ సంద్రమైన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్
పశ్చిమ బంగాల్ బీజేపీ తొలి సీఎం సువేందు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకించడానికి వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ తరలివచ్చారు. దీంతో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ కాషాయ సంద్రంగా మారిపోయింది.
బీజేపీ జెండాలు, బ్యానర్లు పట్టుకున్న బృందాలు మోదీ, సువేందు అధికారికి మద్దతుగా నినాదాలు చేస్తూ కోల్‌కతా వీధుల్లో కవాతు చేశాయి. ‘ఇది ఒక చారిత్రాత్మక రోజు. టీఎంసీ కోరల నుంచి పశ్చిమ బంగాల్ స్వాతంత్య్రం పొందడాన్ని చూసేందుకు మేము వచ్చాం’ అని జార్ఖండ్‌కు చెందిన ఒక బీజేపీ అభిమాని పేర్కొన్నాడు. ప్రమాణ స్వీకారాన్ని స్వ యంగా చూసేందుకు తాను కెనడా నుంచి వచ్చానని బీజేపీ మరో మద్దతుదారుడు తెలిపాడు.
బీజేపీ సీనియర్ నేతకు మోదీ పాదాభివందనం
కోల్‌కతాలో పశ్చిమ బంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రధాని మోదీ 98 ఏళ్ల బీజేపీ కార్యకర్త మఖన్ లాల్ సర్కారుతో ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సభావేదికపై బీజేపీ కార్యకర్త మఖన్‌లాల్ సర్కారు ప్రధానికి అభివాదం చేయగా, మోదీ ఆయన పాదాలకు నమస్కరించి, ఆలింగనం చేసుకుని, ఆశ్వీర్వాదం తీసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున హర్షధ్వానాలు మార్మోగాయి.
మఖన్‌లాల్ సర్కారు (98) పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందినవారు. బీజేపీలో అత్యంత సీనియర్ నాయకులలో ఒకరు. ఈయన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీతో కలిసి పనిచేశారు. 1952లో ముఖర్జీతోపాటు జమ్మూకశ్మీర్‌లో త్రివర్ణ పతకాన్ని ఎగురవే సేందుకు ఉద్యమించిన వారిలో మఖన్‌లాల్ కూడా ఉన్నారు. అనంతరం జైలుకు కూడా వెళ్లారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్పుడు దేశభక్తి గీతం పాడారని ఢిల్లీ పోలీసులు మఖన్‌లాల్‌ను అరెస్టు చేశారు.
కోర్టులో హాజరు పరిచి, క్షమాపణలు చెప్పాలని అడిగితే అందుకు నిరాకరించారు. నేరం చేయలేదని దేశభక్తి గీతం పాడానని న్యాయమూర్తికి చెప్పడమే గాక కోర్టులోనూ ఆ పాటను మళ్లీ పాడారు. దీంతో న్యాయమూర్తి ఆయనను విడుదల చేయాలని, దారి ఖర్చులకు రూ.100 ఇవ్వడంతోపాటు ఫస్ట్‌క్లాస్ టికెట్ ఇప్పించాలని పోలీసులను ఆదేశించారు. 1980లో బీజేపీ ఏర్పడిన అనంతరం పశ్చిమ దినాజ్‌పూర్, జల్పాయిగురి, డార్జిలింగ్ జిల్లాలకు సంస్థాగత సమన్వయకర్త అయ్యారు.
కేవలం ఒక సంవత్సరంలోనే ఆయన దాదాపు 10వేల మంది కార్యకర్తలను బీజేపీలో చేర్చుకోవడంలో కీలకభూమిక పోషిం చారు. 1981 నుంచి ఏడేళ్లపాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. సంస్థాగత పదవిలో రెండేళ్లకు మించి కొనసాగలేని ఆ సమ యంలో ఏడేళ్లు అధ్యక్షుడిగా మఖన్ సర్కారు కొనసాగడం కూడా అరుదైన ఘనతగా చెబుతారు.
మృతిచెందిన బీజేపీ కార్యకర్తలకు ప్రధాని నివాళి
పశ్చిమ బంగాల్ సీఎం ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజేపీ కార్యక ర్తలకు ప్రధాని మోదీ నివాళుల ర్పించారు. బంగాల్‌లో బీజేపీ మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా బీజేపీ సేవలో ప్రాణా లు కోల్పోయిన ఆ పార్టీ కార్యకర్తలకు మోదీ నివాళులర్పించారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేస్తూ, ‘వారి త్యాగం పార్టీ ప్రస్థానంలో శాశ్వతంగా లిఖించబడి ఉంటుంది. వారి ధైర్యం మనందరికీ మూలంగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు.
బంగాల్ జనశక్తికి మోదీ నమస్కారం
బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సువేందు సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి లక్షలాది ప్రజలు తరలివచ్చారు. ఈ జనసంద్రాన్ని చూసిన ప్రధాని మోదీ ముందుగా చేతులు ఊపుతూ అభివాదం చేశారు. అనంతరం కూర్చుని, చేతులు జోడించి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ బెంగాల్ చరిత్రలో బీజేపీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. తమకు మద్దతుగా నిలిచిన ఆ రాష్ట్ర ప్రజలకు మోదీ ఈ విధంగా తన కృతజ్ఞతలు తెలియజేశారు.
సువేందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనా శుభాకాంక్షలు
పశ్చిమ బంగాల్ బీజేపీ తొలి సీఎం సువేందు అధికారికి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా అభినందనలు తెలిపారు. ఈ మేరకు బంగ్లాదేశ్ అవామీ లీగ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సువేందుకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.






