బండి సంజయ్, రేవంత్ ఫ్రెండ్స్
- అందుకే బండి సంజయ్ కొడుకును బాధితుడిగా చిత్రీకరిస్తున్నారు
- రేవంత్‌రెడ్డి చెప్పగానే కేసులో సెక్షన్లు తగ్గించారు
- బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి) : కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని, అందుకే బండి సంజయ్ కొడుకును బాధితుడిగా చిత్రీకరిస్తున్నారని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి చెప్పగానే బండి సంజయ్ కొడుకుపై పెట్టే కేసులో సెక్షన్లు తగ్గించారని ఆరో పించారు. రేవంత్‌రెడ్డి ప్రతి దానికి సిట్ వేస్తారని, ఈ ఘటనపై కూడా సిట్ వేయాలని డిమాండ్ చేశారు.
శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనర్ బాలిక తల్లి పెట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే కేసు నమోదు చేయలేదని, దీంతో బాలిక తల్లి 8 గంటలు పోలీస్ స్టేషన్‌లో నిరీక్షించార ని తెలిపారు. కనీసం ఆమె స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేయలేదన్నారు. బండి సంజయ్ కుమారుడు బాలికను చాటింగ్ చేసి వేధించారని, ఇప్పటి వరకు మూడుసార్లు అత్యా చార యత్నం చేశారని, నూతన సంవత్సరం సందర్భంగా మత్తు మందు కలిపి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు.
బండి సంజయ్‌కు, రేవంత్‌రెడ్డికి, కిషన్‌రెడ్డికి అవినభావ సంబంధం ఉందనే పోలీసులు పట్టించుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని, బండి సంజయ్‌ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బండి తన కుమారుడిని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలని, అతనిపై పోలీసులు పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయాలన్నారు.
బీజేపీలో ఉన్న ఓ మాజీ జర్నలిస్టు మైనర్ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి కేసు విత్‌డ్రా చేసుకోవాలని సూచించారని, బండి సంజయ్ ఒత్తిడి మేరకు మైనర్ బాలిక, తల్లిదండ్రులపై నిర్మల్‌లో కేసు నమోదు చేశారని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కుమారుడిపై హానీ ట్రాప్ అస్త్రం అంటూ బీజేపీ సోషల్ మీడియాలో మైనర్ బాలిక కుటుంబంపై దుష్ప్ర చారం చేయడం తగదన్నారు. బండి సంజ య్ కుమారుడి ఘటనపై ప్రధానమంత్రి మోదీ మాట్లాడాలని డిమాండ్ చేశారు.






