10 May, 2026 | 3:02 AM

తొమ్మిది రాష్ట్రాల్లో తొలిసారిగా బీజేపీ ముఖ్యమంత్రులు

10-05-2026 01:40 AM
  1. ప్రధానిగా మోదీ అధికారం చేపట్టాక ప్రభుత్వాలు
  2. పశ్చిమ బెంగాల్‌లో ఒకేవేదికపై అతిరథ మహారథులు

కోల్‌కతా, మే 9: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టాక తొలిసారి తొ మ్మిది రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు కొలువయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అతిరథ మహారథులంతా ఒకేవేదికపై ఆసీనులయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడం, సీఎంగా సువెందు అధికారి పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో వీరంతా ఒకేవేదికపై కనిపించారు. 2014 నరేంద్రమోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలోని అనేక రాష్ట్రా ల్లో కమలం వికసించి బీజేపీ ముఖ్యమంత్రులు పరిపాలన కొనసాగిస్తున్నారు. హరి యాణా, మహారాష్ట్రలతో ప్రారంభమై అ సోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, ఒడిశా, బిహార్, పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించింది.

2014లో తొలిసారిగా హరియా ణాలో మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ నుంచి సీఎంగా ఎంపికయ్యారు. 2016లో మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్, 2016 అసోంలో సర్బానంద సోనోవాల్, 2016 అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖండూ, 2017 మణిపూర్ బీరెన్ సింగ్ (ప్రస్తుతం యమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్), 2018 త్రిపుర బిప్లబ్ కుమార్ దేబ్, 2024 ఒడిశాలో మోహన్ చరణ్ మాఝీ, 2025 బిహార్ సామ్రాట్ చౌదరీ, 2026 పశ్చిమ బెంగాల్‌లో సువెందు అధికారిలు సీఎంలుగా అధికారం చేపట్టారు.

ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ సీఎంలు ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో అంతకుముందు కూ డా బీజేపీ అధికారాన్ని చేపట్టింది. 2023 చత్తీస్‌గఢ్ విష్ణుదేవ్ సాయ్, 2025 ఢిల్లీ రేఖాగుప్తా, గోవా ప్రమోద్ సావంత్, గుజరాత్ భూపేంద్ర పటేల్, 2023 మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్, 2023 భజన్‌లాల్ శర్మ రాజస్థాన్, 2017 నుంచి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, 2021 ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి, ఏపీలోనూ ఎన్డీయే కూటమి చంద్రబాబునాయుడు సీఎంలుగా కొనసాగుతున్నారు