ఇలంబర్తికి స్వాగతం పలికిన కలెక్టర్ అధికారులు
24-06-2026 05:39 PM
నిర్మల్ జూన్ 24 ( విజయ క్రాంతి): "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" సమీక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ప్రత్యేక అధికారి ఇలంబర్తికి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం అటవీ శాఖ వసతి గృహంలో పూల మొక్కను అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.






