2 May, 2026 | 1:10 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

మెడికవర్ ఆస్పత్రి అరుదైన ఘనత

06-03-2026 12:00 AM

84 ఏళ్ల వృద్ధురాలికి క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్స 

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): వృద్ధాప్యంలో వెన్నెముక సమస్యల వల్ల నడవలేని స్థితికి చేరుకున్న ఒక వృద్ధురాలికి సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రి వైద్య బృందం క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, ఆమెకు మళ్లీ నడకను ప్రసాదించారు. 84 ఏళ్ల సుజాత గత పదేళ్లుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు. కదలలేని పరిస్థితి వచ్చారు.  వైద్య పరీక్షల్లో ఆమెకు వెన్నెముకలో తీవ్రమైన నరాల ఒత్తిడి (స్పునల్ కెనాల్ స్టెనోసిస్), వెన్నెముక క్షీణత ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ఆమెకు మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్య వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం శస్త్రచికిత్సను క్లిష్టతరం చేసింది.  సీనియర్ స్పున్ సర్జన్ డాక్టర్ రమేష్ శీఘాకొల్లి నేతృత్వంలోని స్పున్ సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్ వైద్యుల బృందం సమగ్రంగా పరిశీలించి ‘లంబార్ డికంప్రెషన్’ శస్త్రచికిత్సను విజయవంతం గా పూర్తి చేశారు.