7 June, 2026 | 2:39 AM

మాన్‌సూన్ రెగట్టాలో తెలంగాణకు 15 పతకాలు

07-06-2026 12:00 AM

ముషీరాబాద్, జూన్ 6(విజయక్రాంతి): హుస్సేన్‌సాగర్‌లో జరిగిన17వ మాన్సూన్ రెగట్టా నేషనల్ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణ జట్టు అద్భుత ప్రదర్శనతో 4 స్వర్ణాలు సహా మొత్తం15 పతకాలు సాధించింది.అండర్-16 గరల్స్ విభాగంలో రమీజా భాను స్వర్ణ పతకం గెలుచుకోగా, అండర్-16 బాయ్స్ విభాగంలో రవికుమార్ బెన్నెవోలు గోల్ మెడల్తో పాటు ప్రతిష్ఠాత్మక మాన్సూన్ రెగట్టా ట్రోఫీ, ఎస్.హెచ్.బాబు మెమోరియల్ ట్రోఫీలను కైవసం చేసుకున్నాడు.

అండర్-18 ఇంటర్నేషనల్ 420 మికస్డ్ క్లాస్లో భద్రీనాథ్ నిరుడు-రిశ్విక జోడీ స్వర్ణం సాధించింది.సముద్ర తీరం లేని తెలంగాణ రాష్ట్రం సెయిలింగ్లో 15 పతకాలు సాధించడం విశేషమని యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ చీఫ్ కోచ్ సుహైమ్ షేక్ పేర్కొన్నారు. ఆదివారం జరిగే ముగింపు వేడుకల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు.