7 August, 2026 | 4:57 PM

Breaking News

గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •  

డ్రైడేతో సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు

06-08-2026 09:04 AM

నర్సాపూర్ : సీజనల్ వ్యాధుల నివారణ, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం 'డ్రై డే' కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి నేతృత్వంలో గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి నిల్వ నీటి వల్ల దోమలు వ్యాప్తి చెంది మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదంపై ప్రజలకు వివరించారు. అనంతరం ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న పాత నీటిని తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.