7 August, 2026 | 4:54 PM

Breaking News

గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •  

సోమశిల కృష్ణానది వద్ద తాగుబోతుల వీరంగం..!

06-08-2026 09:22 AM

అర్ధరాత్రి నదిలోకి వెళ్లాలని బోటు సిబ్బందిపై ఒత్తిడి. 

టూరిజం సిబ్బందిపై దాడి.

ఇద్దరికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం. 

కొల్లాపూర్ రూరల్ , ఆగస్టు 6: నాగర్‌ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ మండలం సోమశిల టూరిజం ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి టూరిజం సెక్యూరిటీ సిబ్బంది, బోర్డు డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. కొల్లాపూర్ ఎస్సై ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం, సోమశిల టూరిజం వద్ద నైట్ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డు శివకుమార్, గద్వాలకు చెందిన బోర్డు డ్రైవర్ దేవరాజ్ విధులు నిర్వహిస్తుండగా, షాద్‌నగర్‌కు చెందిన గుర్తు తెలియని వ్యక్తులు టిఎస్ 07 హెచ్ జడ్ 5777 నంబర్ గల కారులో అక్కడికి వచ్చారు.

వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు సమాచారం. వారు కృష్ణా నదిలోకి వెళ్లేందుకు బోర్డు (బోటు) ఏర్పాటు చేయాలని కోరగా, ప్రస్తుతం నీటి మట్టం అధికంగా ఉండటంతో వెళ్లడం సాధ్యం కాదని టూరిజం సిబ్బంది తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన వారు శివకుమార్, దేవరాజ్‌లపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలారు. ఇది గమనించిన స్థానిక గ్రామస్తులు వారిని వెంటనే కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.