calender_icon.png 10 February, 2026 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య సమస్యల నివారణకు చర్యలు

10-02-2026 12:00:00 AM

మలక్‌పేట్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): రానున్న రంజాన్ మాసం ఉపవాస దీక్షలకు పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిహెచ్‌ఎంసి చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రానున్న రంజాన్ మాసం ఉపవాస దీక్షలను పురస్కరించుకొన్ని చాంద్రాయణగుట్ట నర్కి పూల్ బాగ్ లోని జోనల్ కార్యాలయం లో సోమవారం జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ లు, పారిశుద్ధ్య విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... రంజాన్ మాసం నేపథ్యంలో ప్రార్థన మందిరాలు, రద్దీ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు చెత్తను తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మలక్ పేట్, సంతోష్ నగర్, యాకుత్ పురా, చార్మినార్, మూసా రం బాగ్ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు ఇంకేషఫ్ అలీ, మంగ తయారు, సుభాష్, సరిత, భాస్కర్ రెడ్డి, ఎస్ డబ్ల్యూ ఎం డీఈ లు వెంకట్ రాజు, నవీన్ కుమార్, రంజిత్ రెడ్డి, శ్రీరాములు, రాంకీ సంస్థ జోనల్ ఇంచార్జి నందకిశోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.