20 March, 2026 | 8:40 AM

కొత్త సంవత్సరంలో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి

20-03-2026 12:04 AM
  1. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరులో ఘనంగా పంచాంగ శ్రవణం 

హాజరైన ప్రజా ప్రతినిధులు, పట్టణ పుర ప్రముఖులు

పటాన్చెరు, మార్చి 19 :తెలుగు ప్రజల తొలి పండుగ ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజల జీవితాల్లో నూతన కాంతి వెలుగులు నింపాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభిలాషించారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని చైతన్య నగర్ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయ పురోహితులు రాశి ఫలాలను వివరించారు. మినీ ఇండియాగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సరం విజయాలు, అష్ట ఐశ్వర్యాలు కలిగించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 

దేవాలయాల సందర్శన..

ఉగాది పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం డివిజన్ పరిధిలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి కళ్యాణ పత్రిక  రూపకల్పన కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈనెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు.  భక్తులందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమా లను దిగ్విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పట్టణ పుర ప్రముఖులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.