8 July, 2026 | 1:41 AM

జింబాబ్వే టూర్‌కు కోచ్‌గా లక్ష్మణ్

08-07-2026 12:41 AM

బీసీసీఐ కీలక నిర్ణయం

బిజీ షెడ్యూల్‌తో గంభీర్‌కు రెస్ట్

ముంబై, జూలై 7: ఈ నెల చివరి వారంలో భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లబోతోంది. ఈ పర్యటనలో భారత హెడ్ కోచ్ విషయంలోనూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే టూర్ కోసం టీమిండి యా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టబోతున్నాడు. బిజీ షెడ్యూల్ కారణంగా గంభీర్ స్థానంలో లక్ష్మణ్‌ను పంపించాలని బీసీసీఐ నిర్ణయించింది. 

ప్రస్తుతం లక్ష్మణ్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్‌గా వ్యవహరి స్తున్నాడు. భారత్ రాబోయే రోజుల్లో వరుస అంతర్జాతీయ సిరీస్‌లతో బిజీగా ఉండనుంది. దీంతో ఈ సిరీస్ నుంచి గంభీర్‌కు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అతడితో పాటు ఇతర కోచింగ్ సిబ్బంది కూడా జింబా బ్వే పర్యటనకు వెళ్లరని సమాచారం.

ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ టూర్ తర్వాత జింబాబ్వే పర్యటన ఉంటుంది. జింబాబ్వే పర్యటనతో పాటు ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరిగే ఏషియన్ గేమ్స్‌లో కూడా భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఏషియన్ గేమ్స్ సమయంలోనే భారత సీనియర్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. రెండు సిరీస్‌లు ఒకేసారి ఉండటంతో ఈ నిర్ణ యం తీసుకున్నట్లు సమాచారం.జులై 23, 25, 26 తేదీల్లో భారత్, జింబాబ్వే మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.