బల్కంపేట ఎల్లమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి
సికింద్రాబాద్, జూలై 21 (విజయక్రాంతి): హైదరాబాద్లోని ప్రసిద్ధ శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించబడింది. వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం సంప్రదాయ అలంకరణలతో కళకళలాడగా, వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, వారి కుమార్తెతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు కార్యక్ర మంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజ లు చేశారు.
ఈ క్రమంలో డాక్టర్ కోట నీలి మ మాట్లాడుతూ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం అత్యంత ఘనంగా జరిగిం దని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాఫిక్, పారిశుధ్యం, తాగు నీరు, విద్యుత్ తదితర సౌకర్యాలను సమృద్ధిగా కల్పించినట్లు వెల్లడించారు.
బోనాల మహోత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభు త్వం రూ.20 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందని డాక్టర్ కోట నీలిమ తెలిపారు. తెలం గాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబ డి ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.
అమ్మవారి కళ్యాణం కార్యక్రమం డాక్టర్ కోట నీలిమ ఆలయ పరిసరాల్లో స్వయంగా పర్యటిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లను సక్రమంగా నిర్వహించేలా అధికారులతో సమన్వయం చేస్తూ భక్తులు సుల భంగా అమ్మవారిని దర్శించుకునేలా చర్య లు చేపట్టారు.
వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ప్రత్యేక శ్రద్ధచూపుతూ వారికి అవ సరమైన సహాయాన్ని అందించారు. భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యమనే భావనతో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు.






