22 July, 2026 | 3:05 AM

బాల రామాయణం తర్వాత మా సినిమాకే ఆ గౌరవం

22-07-2026 02:34 AM

ఇటీవల ప్రకటించిన 72వ నేషనల్ ఫిలిం అవార్డ్స్‌లో ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ బాల నటుడు విభాగాల్లో రెండు పురస్కారాలను గెల్చుకుంది ‘35 చిన్న కథ కాదు’ సినిమా. ఈ చిత్రంలోని నటనకు ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల. మాస్టర్ అరుణ్ దేవ్ ప్రస్తుతం ‘సమ్మర్ హాలిడేస్’ అనే బాలల చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘35 చిన్న కథ కాదు’ చిత్రబృందాన్ని అభినందించింది ‘సమ్మర్ హాలిడేస్’ టీమ్. ‘సమ్మర్ హాలిడేస్’ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. శ్రీకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మంగళవారం జరిగిన ఈవెంట్‌లో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. “మా టీమ్‌ను అభినందిస్తూ ఈవెంట్ చేస్తున్న ధీరజ్‌కి థ్యాంక్స్. డైరెక్టర్ నందకిషోర్ ఒక యుద్ధం చేస్తే కానీ ఈ ‘35’ కథ బయటకు రాలేదు. ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే స్ఫూర్తిని నింపారు” అన్నారు. మాస్టర్ అరుణ్‌దేవ్ మాట్లాడుతూ.. “35 చిన్న కథ కాదు’ ఇది చాలా పెద్ద కథ. ఓటమి అనే మైనస్ నుంచి గెలుపు అనే ఫ్లస్ వైపు అడుగులు వేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నా.

ఆ సున్నాను దాటుకున్నాం నేషనల్ అవార్డ్స్‌కు చేరుకు న్నాం. ఓడిపోతున్నప్పుడు ధైర్యం చెప్పేందుకు తలా ఒక చేయి అందిస్తారు. అలా మా టీమ్ అందరి చేతులు నా మీద పడి నాకు బలాన్నిచ్చాయి, జాతీయ పురస్కార గౌరవాన్ని అందిం చాయి. మా పేరెంట్స్, ఫ్యామిలీ, టీచర్స్ సపోర్ట్ వల్లే ఈ స్థాయికి రాగలిగాను. ఈ జాతీయ అవార్డును మా అమ్మకు అంకితమిస్తున్నా” అని చెప్పారు. డైరెక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమాకు ఉత్తమ బాలల చిత్రంగా అప్పట్లో బాల రామాయ ణం సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది.

మళ్లీ ఇన్నేళ్లకు మా సినిమాకు ఆ గౌరవం దక్కింది. ఈ చిత్ర దర్శకుడిగా గర్వపడుతున్నా” అని తెలిపారు. నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. “నేను ‘సమ్మర్ హాలీడేస్’ సినిమా ప్రొడ్యూస్ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది ‘35 చిన్న కథ కాదు” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు విశ్వదేవ్, డైరెక్టర్ శ్రీకర్, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడారు. అరుణ్ దేవ్ పేరెంట్స్ సురేశ్, సత్యవాణి కూడా ఈ వేదికపై తమ ఆనందాన్ని పంచుకున్నారు.