సంప్రదింపులు లేవు! బుజ్జగింపులూ లేవు!
- మల్లారెడ్డి పార్టీకి దూరం కావడంపై బీఆర్‌ఎస్ అధిష్టానం మౌనం
- ఎమ్మెల్యేను వదిలించుకోవడానికి సిద్ధమైన పార్టీ
- తెలుగుదేశం పార్టీకి దగ్గరైన సదరు నేత
మేడ్చల్, జూలై 21 (విజయక్రాంతి): మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి చామకూర మల్లారెడ్డి బిఆర్‌ఎస్ పార్టీకి దూర మవుతున్న సంకేతాలు వచ్చినప్పటికీ అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ అగ్రనాయకులు సంప్రదింపులు జరపలేదని తెలిసింది. ఒక నాయకుడు పార్టీ మారడానికి సిద్ధమైతే బుజ్జగించడం సహజం.
కానీ ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఆర్థిక బలం, అంగ బలం పుష్కలంగా ఉన్న నాయకుడు పార్టీకి దూరమవుతుంటే మాట్లాడకపోవడం గమనా ర్హం. మల్లారెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోని అన్నట్లు అగ్ర నాయకులు ఉన్నారు. గతంలో కెసిఆర్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మల్లారెడ్డి ని ఉద్దేశించి ఏదో ఒక పార్టీలో కొనసాగాలని వ్యాఖ్యానించారు. అంటే పార్టీలో ఉంటే ఉండవచ్చు, లేకుంటే వెళ్ళవ చ్చు అన్నట్లు మాట్లాడా రు. పార్టీ అగ్ర నాయకులు స్పందించకున్నప్పటికీ ఇతర నాయకులు మల్లారెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
పార్టీ మల్లారెడ్డికి ఏం తక్కువ చేసిందని ప్రశ్నిస్తున్నారు. కష్టకాలంలో పార్టీ ని వీడడం అవకాశవాద రాజకీయమని విమర్శిస్తున్నారు. అంతే గాక ఘట్కేసర్ సభలో ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శిస్తుంటే మౌనంగా ఉండడాన్ని బీఆర్‌ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. సభ తర్వాత లేదా మరుసటి రోజు కౌంటర్ ఇస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
మల్లారెడ్డి నోట.. కేసీఆర్ పాట..
మల్లారెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి దూరం కావాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. పార్టీ నాయకుల సైతం మల్లారెడ్డిని వదిలించుకోవాలని భావిస్తున్నారు. ఘట్కేసర్ సభలో మౌనంగా ఉన్న మల్లారెడ్డి మేడ్చల్ మండలంలోని కోనాయిపల్లి లో జరిగిన శివాజీ విగ్రహావిష్కరణ సభలో అందరూ శివాజీ మాదిరి పోరాడి కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. తనకు ఎమ్మెల్యే, మంత్రిగా అవకాశం ఇచ్చారన్నారు. దీంతో అక్కడివారు ఆశ్చర్య పోయారు. వ్యూహాత్మకంగానే ఈ మాటలు మాట్లాడారని అంటున్నారు.
టీడీపీకి దగ్గరైన మల్లారెడ్డి..
రామకూర మల్లారెడ్డి ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ దగ్గరయ్యారు. మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో మల్కాజి గిరి నుంచి టీడీపీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. గత సంబంధాలను పునరుద్ధరిం చుకున్నారు. ఆ పార్టీలో చేరే అవకాశాలు లేకపోయినప్పటికీ ఏపీలో కూటమి ప్రభు త్వ అండదండలతో విద్యావ్యాపారాన్ని విస్తరిస్తున్నారు.
ఇప్పటికే తిరుపతిలో డీమ్డ్ యూనివర్సిటీ అనుమతి పొందగా, విశాఖలోని మరో యూనివర్సిటీ ఏర్పాటుకు ప్ర యత్నిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లతో టచ్‌లో ఉన్నారు. టీడీపీ, బీజేపీ కూటమిగా ఉన్నందున విద్యా వ్యాపారంగా, రాజకీయపరంగా లబ్ధిపొందే అవకాశం ఉంది. దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.






