మనసాగదే.. కొనసాగదే..
రాకింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. యష్, గీతు మోహన్‌దాస్ కలిసి కథను అందించగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో యష్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ఈ సినిమాను రూపొందిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ రెండో పాట తెలుగు వెర్షన్‌ను ‘మనసాగదే..’ టైటిల్‌తో రిలీజ్ చేశారు.
తెలుగు సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందించారు. తనిష్క్ బాగ్చి, అర్‌స్లాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీని సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించారు. ‘బలమైన మెరుపేదో నను తాకి కనుమరుగైందే.. బరువైన సుడిగాలిలో నా ఏకాంతమే నలుగుతున్నదే.. అంతులేని అలజడి ఏంటిలా.. బదులే లేని ప్రశ్నే వింటున్నానే.. తియ్యని గుండెల నిన్నటి వెన్నెల.. కదలిపోతున్న నా దారి వదలనన్నదే.. మనసాగదే కొనసాగదే.. నను నన్నుగా నిలువనియ్యదే..’ అంటూ సాగుతోందీ గీతం. ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్‌లో యష్, తారా సుతారియాల మధ్య కనిపించే కెమిస్ట్రీ, ఎమోషన్స్ కట్టిపడేసింది.






