సీఎం.. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలకు పాలాభిషేకం
ఉట్నూర్,(విజయక్రాంతి ): మే డే సందర్భంగా కార్మికులలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శుక్రవారం ఉట్నూర్ లోని ఆర్టీసీ బస్ డిపో ముందు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్,ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ లకు ఆర్టీసీ కార్మికులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది.
RTA మేంబర్ దుట రాజేశ్వర్, బానోత్ జైవంత్ రావ్ జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బిరుదుల లాజర్ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్,ఆత్రం తిరుపతి సర్పంచ్, గోడిపెల్లి రాజేశం,జాదవ్ జగదీష్, మెస్రం భాగ్యలక్ష్మి, మర్సకోల సరస్వతి,ఎస్వీ రెడ్డి,సయ్యద్ ఇక్బాల్, సయ్యద్ నిసార్, కొత్తపెళ్లి మహేందర్,అచ్చా దేవానందం, అరకిల్లా పరమేశ్వర్,ఆత్రం రాహుల్, మర్స్ కొల తిరుపతి, గొల్లపల్లి శ్రీనివాస్, కోడి ప్రభాకర్, జాదవ్ రాజేష్, సంతు,అబ్దుల్ ఖైసర్ మొదలగు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది.
ఘనంగా మేడే దినోత్సవం.. ఉట్నూర్ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లో కార్మికులు ఘనంగా మేడే దినోత్సవాన్ని జరుపుకున్నారు. పుట్లూరు మండల కేంద్రంలో గ్రామీణ పేదల సంఘం తో కార్మికులు మేడే దినోత్సవం జరుపుకున్నారు. ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలోని గ్రామాల్లో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.






