1 May, 2026 | 5:12 PM

ఎండ తీవ్రతకు తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి

01-05-2026 04:06 PM

మఠంపల్లి మే 01 (విజయ క్రాంతి): ఉపాధి కూలీలు ఎండ దెబ్బ నుంచి కాపాడుకోవాలంటే ముందస్తు తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలని పెదవీడు గ్రామ సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు సూచించారు. మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామ పరిధిలో ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్న మహిళా కూలీలకు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉప సర్పంచ్ మల్ రెడ్డి త్రివేణి కోటి రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ బిచ్చు,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు