1 May, 2026 | 5:10 PM

నిషేధిత క్రిమిసంహారక మందులు విక్రయిస్తే చర్యలు తప్పవు

01-05-2026 04:10 PM

బోత్ మే1.( విజయ క్రాంతి): ప్రభుత్వం నిషేధించిన హెచ్ టి బి టి కాటన్ విత్తనాలతో పాటు నిషేధించిన మోనో సిల్ గ్లైపోసిట్ లాంటి వంటి నీ విగ్రహిస్తే కేసులు తప్పవని సోనాల మండల వ్యవసాయ అధికారి జి దేవా పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలు విత్తన డీలర్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దని విత్తనాలు పురుగు మందులు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. కొనుగోలు చేసిన వెంటనే తీసుకున్న రసీదును భద్రపరచాలన్నారు. సమావేశంలో తహసిల్దార్ మల్లేష్ మాట్లాడుతూ డీలరు తమ తమ షాపుల వద్ద ఏర్పాటుచేసిన బోర్డులపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది సెల్ నెంబర్లను ప్రదర్శించాలన్నారు. నిబంధనలు పాటించకపోతే కేసుల్లో ఇవ్వవలసి ఉంటుందన్నారు. సమావేశంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఉమా విత్తన డీలర్లు విట్టల్ నాగభూషణం పోతన్న లక్ష్మణ్ వినోద్ తదితరులు ఉన్నారు