18 August, 2026 | 3:15 AM

‘పైలట్’కు జన నీరాజనం

18-08-2026 01:29 AM

తాండూరు, ఆగస్టు 17, ,(విజయక్రాంతి)డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వికారాబాద్ జిల్లా తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సుదీర్ఘకాలం తర్వాత తాండూర్ పట్టణానికి సోమవారం విచ్చేయడంతో  బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు దాదాపు 5000 మంది కార్యకర్తలు తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. విలియం మూన్ చౌరస్తా వద్ద పైలట్ కు గజమాల వేసి, బాణాసంచా పేల్చి సంబరాలు చేశారు.

ఈ సందర్భంగా పైలట్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలన లో అభివృద్ధి కుంటుపడిందని.. సంక్షేమం కనబడకుండా పోయిందని  బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే రైతులు,ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని ఆయన అన్నారు. తాండూర్ ప్రజలు తనపై చూపిన ఆధార అభిమానాలు మునుముందు కూడా ఉండాలని అభివృద్ధి చేసేందుకు ఎంతవరకైనా వెళ్తానని నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూర్ మండలాల తో పాటు మున్సిపల్ పరిధిలోని నాయకులు ,కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.