జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మా అభ్యర్థులను మేమే నిర్ణయిస్తాం
బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఈటల రాజేందర్ అసంతృప్తి
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై మాల్కాజిగిరి ఎంపీ ఈటల రా జేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను రాష్ట్ర నాయకత్వం నిర్ణ యించడం సరికాదని, తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులను తామే ఎంపిక చేసి బరి లోకి దించుతామని రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన కో రారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీజేపీ నాయకులతో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా హాట్‌టాపిక్‌గా మారాయి.
ఈ అంశంలో ఎంపీలు రఘునందన్‌రావు, విశ్వేశ్వర్‌రెడ్డి తాను ఇప్పటికే సర్వేలు చేశామని, తమ అభ్యర్థులను తామే నిర్ణయిస్తామని ఆ సమావేశంలో విజ్ఞప్తి చేసినట్లుగా తెలిసింది. పార్టీ నిర్ణయాల్లో తనకు కనీస సమా చారం అందడంలేని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ముందే ఈటల ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు ఈటల బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది.




