3 April, 2026 | 3:29 AM

టీఆర్పీలో భారీగా చేరికలు

03-04-2026 01:47 AM

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చారిర్జ బందారపు నర్సయ్యగౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మల్లెల వీరనారాయణ సూచన మేరకు,

జిల్లా ఉపాధ్యక్షులు కోడెబోయిన రవి పటేల్ ఆధ్వర్యంలో భద్రాచ లం పట్టణానికి చెందిన వివిధ పార్టీల నాయకులు గురువారం టీఆర్పీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీ లోకి రవి పటేల్ ఆహ్వానించిచారు. పార్టీలో చేరిన వారిలో ఎం.వి. గోపాలకృష్ణ, సి.హెచ్. చారి, ఎస్. సాయికృష్ణ, పి. శివకుమార్, పి.కృష్ణవరం, టి.నరేష్, కె. ప్రసాద్, కె. మోహన్ ఉన్నారు.