30 March, 2026 | 4:25 AM

బీఆర్‌ఎస్ పార్టీలోకి భారీ చేరికలు

30-03-2026 01:20 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రెబ్బెన, లింగాపూర్ మండలాలకు చెం దిన ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి వారికి పార్టీలోకి ఆహ్వానం పలికారు.

క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కేటీఆర్ వారికి సూచించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు గతంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, రైతులకు అందించిన సహాయం తమను ఆకర్షించాయని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

కేటీఆర్ నాయకత్వంపై నమ్మకంతోనే వివిధ పార్టీలకు చెందిన సుమారు 36 మంది నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.పార్టీలో చేరిన వారిలో అనుముల రాజేష్ (రోళ్ళపాడు సర్పంచ్), రెబ్బెన సుధాకర్,జాదవ్ రాజశేఖర్ (లింగాపూర్ సర్పంచ్),పవార్ సులోచన (చిన్న దాంపూర్ సర్పంచ్),ఆడె సునీత హట్యా నాయక్ (పిట్టగూడ సర్పంచ్),పవార్ బాబూలాల్(ఎల్లాపటార్ సర్పంచ్),నైతం ఛత్రు (ఉప సర్పంచ్, అంకాపూర్). ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన రెబ్బెన, లింగాపూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.