విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం
రోడ్డునపడ్డ 90 మంది నిరుద్యోగ యువకులు
శేరిలింగంపల్లి, మే 18 (విజయక్రాంతి): హైదరాబాద్లో మరోసారి విదేశీ ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయల మోసం బయటపడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్‌లోని సి.డి.దశరథ్ కన్సల్టెన్సీ అనే సంస్థ నిరుద్యోగులను నమ్మించి సుమారు 90 మంది యువకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ అయింది. ఈ కన్సల్టెన్సీ నిర్వాహకులు అర్చన ప్రియ, సోమశేఖర్, రాజేంద్రప్రసాద్‌లు ఈజిప్ట్, ఇజ్రాయెల్ దేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగాలు ఇస్తామని ఆశలు చూపి యువకులను మోసం చేశారు.
ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నా రు. కొంతమంది యువకులను ఈజిప్ట్ వరకు తీసుకెళ్లినా, అక్కడ వాగ్దానం చేసిన ఉద్యోగాలు లభించలేదు. కన్సల్టెన్సీ నిర్వాహకులు ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివ రికి సొంత ఖర్చులతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. హఫీజ్‌పేట్‌లోని కన్సల్టెన్సీ కార్యాలయం మూసివేయడంతో బాధితులు షాక్‌కు గురయ్యారు. కార్యాలయం వద్ద తాళా లు వేసి ఉండటం చూసి మోసం జరిగిన విష యం బయటపడింది. దీంతో పెద్ద సంఖ్యలో బాధితులు మియాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.






