19 May, 2026 | 1:03 AM

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో కటింగ్‌లు లేకుండా వడ్లు, మక్కలు కొనుగోలు

19-05-2026 12:00 AM

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు 

సుల్తానాబాద్, మే 18 (విజయక్రాంతి): రా ష్ట్రంలో ఎక్కడ లేని వి ధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో మక్కలు, ధా న్యం కొనుగోలు చేయ డం జరుగుతుందని  ప్ర భుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, సోమవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామంలో మార్క్ ఫేడ్ , సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న , వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు, కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్న విషయమై అప్పటికప్పుడు ఎమ్మెల్యే విజయరమణ రావు  అధికారులతో చర్చించి రైతుల సమస్యలను పరిష్కరించారు.

ఈ సందర్భంగా  విజయరమణ రావు మాట్లాడుతూ..కొనుగోళ్ల విషయంలో చిన్న చిన్న విషయాలను రాద్ధాంతం చేసి రాజకీయాలు చేయడం తగదన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎలాంటి కటింగులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు జరుపు తున్నట్టు చెప్పారు. అధికార యంత్రాంగంతో రైస్ మిల్లర్ పై ఒత్తిడి తెచ్చి వడ్ల దిగుమతిని చేయిస్తూ ప్రతిక్షణం పర్యవేక్షణ జరుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు , పలు గ్రామాల సర్పంచ్ లు , మండల పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు  పాల్గొన్నారు.