చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి
ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు సర్పంచ్ ఆధ్వర్యంలో రైతుల వినతి
చిట్యాల,(విజయ క్రాంతి): పిలాయిపల్లి కాల్వ ద్వారా వచ్చే నీటిని పెద్దకాపర్తి పెద్ద చెరువు నుంచి చిన్నకాపర్తి గ్రామంలోని చెరువులకు తరలించేందుకు అవసరమైన కాలువను నిర్మించాలని కోరుతూ చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ నాయకులు, రైతులు సోమవారం నకిరేకల్‌లోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిలాయిపల్లి కాల్వ నీరు చిన్నకాపర్తి చెరువులకు చేరేలా కాలువ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం, సమస్యను పరిశీలించి కాలువ నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.






