దోరకుంటలో వన మహోత్సవం
27-07-2026 07:45 PM
కోదాడ,(విజయక్రాంతి): దోరకుంట గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా కోదాడ రూరల్ ఎస్సై యాకుబ్, గ్రామ సర్పంచ్ పాలకి సురేష్ సోమవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. పర్యావరణం కాపాడడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ పత్తిపాక రమాదేవి, వార్డ్ మెంబర్ దాసరి ఉమా, పత్తిపాక వెంకటేశ్వర్లు, దాసరి వీరబాబు, కానిస్టేబుల్స్ ధనుంజయ్ రాజేష్ నాగేంద్రబాబు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.






