విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోండి
27-07-2026 07:55 PM
మండల వ్యవసాయ అధికారి సుజాత
బాలానగర్: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సుజాత సూచించారు. బాలానగర్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన విత్తన మేళాను ఆమె ప్రారంభించి మాట్లాడారు. మండలంలోని 37 గ్రామపంచాయతీల రైతులు వరి సాగుకు బదులుగా మొక్కజొన్న, పెసర, పొద్దుతిరుగుడు, తదితర ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న నాణ్యమైన విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.






