పేద రెడ్ల హక్కుల కోసం 8న మహా నిరసన దీక్ష
రెడ్డి జేఏసీ చైర్మన్ రామ్ రెడ్డి
ముషీరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాం తి): పేద రెడ్ల సంక్షేమం కోసం సెప్టెంబర్ 8న ఇందిరాపార్క్ వద్ద మహా నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు రెడ్డి జేఏసీ చైర్మన్ అప్పం గారి రామ్ రెడ్డి తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్క్ల బ్లో సోమవారం నిర్వహించిన పోస్టర్ ఆవిష ్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్కు రూ.1,000 కోట్లు కేటాయించి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని, 15 ఎకరాల భూమిని పేద రెడ్ల ప్రయోజనా ల కోసం కొనసాగించాలని డిమాండ్ చేశారు.
రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు విద్య, ఉద్యోగాలు, మెడికల్ సీట్లలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కో రారు. సెప్టెంబర్ 8న జరిగే దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా పేద రెడ్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగర్తి చంద్రారెడ్డి, గోపు జైపాల్ రెడ్డి, బుచ్చంగారి మాధవరెడ్డి, ఫైళ్ల హరినాథ్ రెడ్డి, అర్జున కిషన్ రెడ్డి, నీరుడు ద యాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, నందరెడ్డి, రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






