దుస్తుల షూస్ పంపిణీ
01-09-2026 12:15 AM
మహా ముత్తారం(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల మహా ముత్తారం లో సోమవారము ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేరి ప్రభాకర్ ఆధ్వర్యంలో దుస్తులు, షూ పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా ఏ ఏ పీసీ చైర్మన్ శైలజ డీపీఎం చౌహన్ హాజరై ఈ సందర్భంగా చౌహాన్ శైలజ ప్రధానోపాధ్యాయులు చేరి ప్రభాకర్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు రెండు జతలు బట్టలు, షూస్ ,పుస్తకాలు నోట్ బుక్స్ స్పోర్ట్స్ డ్రేస్ ఇస్తూ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన చేయడం జరుగుతుందని విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీస్తూ విద్యార్థుల స్థాయికి దిగి విద్యాబోధన చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలుపడం జరిగింది.






