25న ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మహాధర్నా
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ
ముషీరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): బీసీ మహిళలకు కనీసం మండల్ కమిషన్ ప్రతిపాదించిన నిష్పత్తి మేరకు 27 శాతం బీసీ కోటా, ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్లో 2008 మధ్య అమలైన విధానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న విద్య, ఉద్యోగ, స్థానిక రిజర్వేషన్ల పెంపు బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.
బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు, విద్యా హక్కులు కల్పించాలని కోరు తూ నిర్వహించే మహాధర్నాకు బీసీ సంఘా లు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హా జరై విజయవంతం చేయాలని ఆర్. సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ కుమార్ పటేల్, బిసి న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాద వ్, బీసీ సంఘం నాయకులు జనార్దన్ గౌడ్, నంద గోపాల్ తదితరులు పాల్గొన్నారు.






