19 May, 2026 | 1:20 PM

ఐఐసీటీ గ్రేడ్ వన్ పరీక్ష మాస్ కాపీయింగ్

19-05-2026 12:00 AM

12 మంది అరెస్ట్... కాపీకి పాల్పడిన ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం

ఉప్పల్, మే 18 (విజయక్రాంతి): హైదరాబాద్ నాచారం ప్రాంతంలోని ప్రతిష్టాత్మకంగా ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో మే 17న నిర్వహించిన గ్రేడ్ వన్ పోస్టులో పరీక్షలో  భారీగా మాస్ కాఫీయింగ్ సమాచారం మేరకు నాచారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మాస్ కాపీయింగ్ పాల్పడుతున్న 12 మంది అభ్యర్థులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.  నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ కథనం మేరకు.. ఐఐ సిటీ గ్రేడ్ వన్ పోస్టుల పరీక్ష ఈ నెల 17న నిర్వహించింది.

నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సెయింట్ పియిస్ కాలేజీలో నియామక పరీక్ష  సెంటర్ గా నిర్వహించారు. ఈ క్రమంలో  అభ్యర్థులు చెవుల్లో మైక్రో ఫో న్లు, శరీర రహస్య కమ్యూనికేషన్ పరికరాలు దాచుకొని పరీక్ష రాస్తున్నారని సమాచారం అందుకున్న నాచారం పోలీసులు  పరీక్ష కేంద్రంపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో  మదీప్ అనే అభ్యర్థి అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో తనిఖీ నిర్వహించారు మదీప  అనే అభ్యర్థి  వద్ద ఎలక్ట్రికల్ పరికరాలు దొరకడంతో తనిఖీలను ముమ్మరం చేశారు. 

ఈ తనిఖీల్లో మరో 12 మంది అభ్యర్థుల వద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు లభించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఐ సిటి ఉన్నత అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు రహస్య కమ్యూనికేషన్  గార్జిరెట్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థులు హర్యానాలోని మైండ్కు టైపింగ్ సంస్థ ద్వారా శిక్షణ పొందినట్లు బయట ఉన్న హేడర్ల సహాయం తో ప్రశ్నాపత్రాన్ని స్కాన్ చేయించి సమాధానాలను స్వీకరించడం ద్వారా పరీక్షలు చీటింగ్ పాల్పడినట్టు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల హామీ ఇచ్చి లక్ష నుండి 8 లక్షల వరకు డబ్బులు తీసుకొని లావాదేవీలను పోలీసులు గుర్తించారు. మాస్ కాపీయింగ్ పాల్పడిన 12 మంది అభ్యర్థులను  నిందితుల ను రిమాండ్ తరలించినట్టు నాచారం ఇన్‌స్పెక్టర్ ధనుంజయ గౌడ్ పేర్కొన్నారు. ఈ ఘట నతో పరీక్ష వ్యవస్థ పారదర్శకపై ప్రశ్నల తలెత్తుతున్నాయి నిజాయితీగా పరీక్ష రాసిన అభ్య ర్థుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుండగా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునామృతం కాకుండా మరింత కఠినమైన పర్యవేక్షణ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.