26 August, 2026 | 2:39 AM

పలు కుటుంబాలను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు

26-08-2026 12:04 AM

రామగిరి,(విజయ క్రాంతి): మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ రామగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. రత్నాపూర్ గ్రామానికి చెందిన కీ॥శే॥ ఉడుత మల్లక్క, దశదినకర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కల్వచర్ల గ్రామానికి చెందిన ఇటీవల మృతి చెందిన కీ॥శే॥ కాట ప్రమీల, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే వెంకట్రావుపల్లె మాజీ ఎంపీటీసీ బత్తిని శ్రీనివాస్ తల్లి కీ॥శే॥ లక్ష్మి. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయా కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్.


 ఈ కార్యక్రమం లో  రామగిరి మండలం మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్,రామగిరి మండలం sc సెల్ అధ్యక్షులు కండె పోషం, మాజీ సర్పంచ్ ఎరుకల ఓదెలు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు మట్ట రాజకుమార్,మాజీ ఉప సర్పంచ్ నరేష్ యాదవ్,మాజీ ఉప సర్పంచ్ కనుకయ్య రత్నాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్,కల్వచర్ల గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణమూర్తి,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒర్రె సది,బర్ల శ్రీకాంత్, సదానందం ,గొల్లపల్లి రాజమల్లు,రత్నాపూర్, కల్వచర్ల, వెంకట్రావు పల్లె  కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.